భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్... ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్ కైవసం
- యునైట్8 స్పోర్ట్స్ చేతికి ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు
- టీవీలో యునైట్8, ఓటీటీలో జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు
- 2034 వరకు ఫిఫా మేజర్ టోర్నీలన్నీ జీ నెట్‌వర్క్‌లోనే
- ధర విషయంలో విభేదాలతో వెనక్కి తగ్గిన జియోస్టార్
- క్రీడా ప్రసారాల్లోకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ రీ-ఎంట్రీ
భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ శుభవార్త చెప్పింది. ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రసార హక్కులను జీకి చెందిన ‘యునైట్8 స్పోర్ట్స్’ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, 2026 ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు 2030 వరల్డ్ కప్ కూడా జీ నెట్‌వర్క్‌లోనే ప్రసారం కానున్నాయి. టీవీలో యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లలో, డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
ఈ ఒప్పందం కేవలం పురుషుల వరల్డ్ కప్‌కు మాత్రమే పరిమితం కాదు. 2027 ఫిఫా మహిళల వరల్డ్ కప్‌తో పాటు అండర్-17, అండర్-20, ఫుట్‌సాల్ వరల్డ్ కప్ వంటి ఇతర ప్రధాన ఫిఫా ఈవెంట్‌ల ప్రసార హక్కులను కూడా 2034 వరకు జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. హిందీలో యునైట్8 స్పోర్ట్స్ 1, 1 HD ఛానళ్లలో, ఇంగ్లీష్‌లో యునైట్8 స్పోర్ట్స్ 2, 2 HD ఛానళ్లలో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.
వాస్తవానికి ఈ హక్కుల కోసం జియోస్టార్ కూడా పోటీ పడింది. అయితే ధర విషయంలో ఫిఫాతో ఒప్పందం కుదరకపోవడంతో ఆ సంస్థ వెనక్కి తగ్గింది. 2026 వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుండటంతో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం చాలా ఆలస్యంగా ప్రారంభమవుతాయి. అయినప్పటికీ, జీ ఈ హక్కులను దక్కించుకోవడం విశేషం.
ఈ ఒప్పందంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ పునిత్ గోయెంకా హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంబరాల్లో ఒకటైన ఫిఫా వరల్డ్ కప్‌ను భారత ప్రేక్షకులకు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఫిఫాతో మా భాగస్వామ్యం ద్వారా ఈ క్రీడ నిజమైన విలువను వెలికితీయగలమని నమ్ముతున్నాము" అని ఆయన తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత జీ నెట్‌వర్క్ తిరిగి క్రీడా ప్రసారాల్లోకి గ్రాండ్‌గా అడుగుపెడుతుండటం గమనార్హం. 2026 ఫిఫా వరల్డ్ కప్ జూన్ 11న ప్రారంభం కానుంది.